: భద్రాచలం వద్ద భారీగా పెరుగుతున్న గోదావరి నీటి మట్టం
పవిత్ర పుణ్యక్షేత్రం భద్రాచలం వద్ద గోదావరి నది ఉగ్రరూపం దాలుస్తోంది. ఎగువన కురుస్తున్న భారీ వర్షాల వరదతో పాటు, ఎగువన ఉన్న జలాశయాల నుంచి నీటిని విడుదల చేస్తుండటంతో... నదీ ప్రవాహం భారీగా పెరుగుతోంది. ప్రస్తుత నీటి మట్టం 35.5 అడుగులకు చేరుకుంది. ఈ రాత్రికి 38 అడుగులకు చేరుకునే అవకాశం ఉంది. లోతట్టు ప్రాంతాల్లోని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు తెలిపారు.