: నిమజ్జనానికి వెళ్లి కాల్వలో గల్లంతైన యువకుడు మృతి


గణేశ్ నిమజ్జనోత్సవంలో అపశృతి చోటు చేసుకుంది. నిమజ్జనానికి వెళ్లిన ఫణిరాజు (26) అనే యువకుడు కాల్వలో గల్లంతై మృతి చెందాడు. ఈ ఘటన పశ్చిమగోదావరి జిల్లా ఉండి మండలం మహదేవపట్నంలో నిన్న అర్ధరాత్రి చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే, వినాయకుడిని నిమజ్జనం చేసేందుకు పంట కాల్వలోకి ఫణిరాజు దిగాడు. కొంత సేపటి తర్వాత తన భర్త కనిపించడం లేదని ఆమె భార్య వరలక్షి గుర్తించడంతో.... ఫణిరాజు కోసం అందరూ గాలించారు. ఈ ఉదయం అతని మృత దేహాన్ని వెలికి తీశారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

  • Loading...

More Telugu News