: ఐక్యరాజ్య సమితి శిక్షణ కార్యక్రమానికి ఎంపికైన తెలుగువాడు
ఐక్యరాజ్య సమితి, ఆస్ట్రియా ప్రభుత్వం సంయుక్తంగా నిర్వహించే శిక్షణా కార్యక్రమానికి మనదేశం నుంచి హైదరాబాదు తార్నాకకు చెందిన దీకొండ రమేశ్ ఎంపికయ్యాడు. అంతర్జాతీయంగా శాంతి స్థాపన కోసం ఈ శిక్షణా కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. వృత్తి రీత్యా న్యాయవాది అయిన రమేశ్ ఈ ఆహ్వానాన్ని అందుకోవడం పట్ల ఆనందం వ్యక్తం చేశారు. ప్రపంచంలోని సమస్యాత్మక ప్రాంతాల్లో శాంతి స్థాపనకు నిపుణులను తయారుచేయడానికి ఐక్యరాజ్యసమితి ఇచ్చే ఈ శిక్షణ కార్యక్రమం వియన్నాలో సెప్టెంబరు 28 నుంచి అక్టోబరు 24 వరకు జరుగుతుంది. ప్రతి యేటా ఈ శిక్షణకు 11 మందిని వివిధ దేశాల నుంచి ఎంపిక చేస్తారు.