: ఏటూరు నాగారం వద్ద గోదావరి వరద ఉద్ధృతి
వరంగల్ జిల్లా ఏటూరు నాగారం మండలంలోని రామానగరం వద్ద గోదావరి వరద ఉద్ధృతి పెరుగుతోంది. రామన్నగూడెం పుష్కర ఘాట్ వద్ద గోదావరి నీటిమట్టం 8.5 మీటర్లకు చేరింది. దీంతో అధికారులు అప్రమత్తమై మొదటి ప్రమాద హెచ్చరికను జారీ చేశారు. పుష్కర ఘాట్ వద్ద గోదావరి నీటిమట్టం 9.9 మీటర్లకు చేరుకుంటే రెండో ప్రమాద హెచ్చరికను జారీ చేయనున్నట్లు అధికారులు తెలిపారు. వరద ఉద్ధృతి పెరిగే అవకాశం ఉందని కేంద్ర జలవనరుల సంఘం పుష్కర ఘాట్ ఇన్ ఛార్జి పుల్లారావు తెలిపారు. వరద పరిస్థితిని ఎప్పటికప్పుడు అంచనా వేస్తున్నట్లు స్థానిక తహశీల్దార్ చెప్పారు.