: ఉత్సాహంగా సాగిన ఓనం ఫుడ్ ఫెస్టివల్
హైదరాబాదులో ఓనం ఫుడ్ ఫెస్టివల్ ఉత్సాహంగా సాగింది. కేరళ నూతన సంవత్సరాన్ని పురస్కరించుకుని నగరంలోని రాంనగర్ లో సన్ ఇంటర్నేషనల్ ఆఫ్ టెక్నాలజీ అండ్ మేనేజ్ మెంట్ కాలేజీలో జరిగిన ఓనం ఫుడ్ ఫెస్టివల్ లో విద్యార్థినీ విద్యార్థులు కేరళ సంప్రదాయ దుస్తులను ధరించి ఈ వేడుకల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా విద్యార్థులు తయారుచేసిన 13 రకాల వంటకాలు అందరినీ మెప్పించాయి. ఉత్సవంలో భాగంగా విద్యార్థినీ విద్యార్థులు సంప్రదాయబద్ధంగా నృత్యాలు చేశారు.