: శ్రీవారి సన్నిధిలో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి
దేశ అత్యున్నత న్యాయస్థానమైన సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఆర్ఎం లోథా నేడు తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ప్రధాన న్యాయమూర్తి హోదాలో ఆయన తొలిసారి తిరుమలకు విచ్చేశారు. ఈ సందర్భంగా ఆయనకు టీటీడీ ఈవో గోపాల్, జేఈవో శ్రీనివాసరాజు, అర్చకులు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. స్వామివారి దర్శనానంతరం ఆయన హుండీలో కానుకలు సమర్పించారు. జస్టిస్ లోథాతో పాటు ఆయన కుటుంబ సభ్యులు కూడా శ్రీవారిని దర్శించుకున్నారు.