: హైదరాబాద్ గణేశ్ నిమజ్జనానికి సర్వం సిద్ధం


హైదరాబాదులో తొమ్మిది రోజులుగా పూజలందుకుంటున్న గణనాథుడు నిమజ్జనానికి తరలివెళ్లేందుకు సిద్ధమవుతున్నాడు. ప్రతి యేటా భాగ్యనగర్ గణేశ్ ఉత్సవ సమితి ఆధ్వర్యంలో ప్రతిష్ఠాత్మకంగా జరిగే నిమజ్జనోత్సవానికి అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. సోమవారం జరిగే నిమజ్జనోత్సవ ఏర్పాట్లలో జీహెచ్ఎంసీ, ప్రభుత్వ యంత్రాంగంతో పాటు పోలీసులు తలమునకలై ఉన్నారు. 30 వేల మంది పోలీసులతో నిమజ్జనానికి పటిష్ఠ భద్రతను ఏర్పాటు చేశారు. ఇందుకు గాను 40 క్రేన్లు, 71 మొబైల్ క్రేన్లు ఏర్పాటయ్యాయి. హుస్సేన్ సాగర్ లో నిమజ్జనమయ్యే 30-35 వేల విగ్రహాల్లో ఒక్క ట్యాంక్ బండ్ పై నుంచే 10-12 వేల వరకు వేయనున్నారు. సోమవారం నాడు జరిగే నిమజ్జనోత్సవాన్ని కనులారా చూడాలనుకునే వారి సౌకర్యార్థం ఆర్టీసీ, రైల్వే శాఖలు భారీగా ఏర్పాట్లు చేశాయి. ట్యాంక్ బండ్ కు సురక్షితంగా రాకపోకలు సాగేలా ప్రత్యేక సర్వీసులను ఆర్టీసీ అందుబాటులో ఉంచింది. మొత్తం 400 ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేశారు. అదనంగా ఎనిమిది ఎంఎంటీఎస్ రైళ్లు నడపనున్నట్లు రైల్వే అధికారులు తెలిపారు.

  • Loading...

More Telugu News