: కాంగ్రెస్ అభ్యర్థిని ఎదుర్కొనలేక చిల్లర విమర్శలు చేస్తున్నారు: టీఆర్ఎస్ పై పొన్నాల ధ్వజం


మెదక్ లోక్ సభ స్థానం ఉపఎన్నిక వ్యవహారం మరింత వేడెక్కింది. పార్టీల మధ్య మాటల యుద్ధం సాగుతోంది. ఈ క్రమంలో తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (టీపీసీసీ) చీఫ్ పొన్నాల లక్ష్మయ్య టీఆర్ఎస్ నేతలపై ధ్వజమెత్తారు. కాంగ్రెస్ అభ్యర్థిని ఎదుర్కొనడం చాతకాక టీఆర్ఎస్ నేతలు చిల్లర విమర్శలు చేస్తున్నారని వ్యాఖ్యానించారు. నర్సాపూర్ లో సభ పెట్టాల్సిన అవసరం ఏముందని, ఎవరిని చూసి భయపడి ఆ సభ పెడుతున్నారో కేసీఆర్ చెప్పాలని పొన్నాల డిమాండ్ చేశారు. ప్రజల సెంటిమెంట్ ను కేసీఆర్ అధికారం కోసం వాడుకుంటున్నారని దుయ్యబట్టారు.

  • Loading...

More Telugu News