: 'అన్న' క్యాంటీన్ల నిర్వహణకు ముందుకు వచ్చిన రామకృష్ణ మిషన్, ఇస్కాన్


ఎన్టీఆర్ పేరిట రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్న 'అన్న' క్యాంటీన్ల నిర్వహణకు రామకృష్ణ మిషన్, ఇస్కాన్ ముందుకువచ్చాయి. ఈ బడ్జెట్ క్యాంటీన్ల నిర్వహణ బాధ్యతలను తాము చేపడతామని ప్రభుత్వానికి తెలిపాయి. వచ్చే మంత్రివర్గ సమావేశంలో దీనిపై నిర్ణయం తీసుకోనున్నారు. కాగా, తమిళనాడులో 'అమ్మ' క్యాంటీన్ల పనితీరును పరిశీలించేందుకు మంత్రి వర్గ ఉపసంఘం ఈ నెల 16న చెన్నై వెళ్ళనుంది. మంత్రులు పరిటాల సునీత, ప్రత్తిపాటి పుల్లారావు, నారాయణ తదితరులు ఈ సంఘంలో ఉన్నారు.

  • Loading...

More Telugu News