: ఇంటి చుట్టూ వరదనీరు... తాగునీరు, మందుల్లేక మంత్రి విలవిల
కాశ్మీర్ పర్యాటక మంత్రి జీఏ మీర్ వరదల్లో చిక్కుకుపోయారు. గత రెండ్రోజులుగా కంబాల్ లోని తన నివాసంలోనే ఆయన ఆహారం, తాగునీరు, మందులు లేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వరదల నేపథ్యంలో తన నియోజకవర్గ ప్రజల స్థితిగతులను పరిశీలించేందుకు వెళ్ళిన ఆయన వరదనీటిలో చిక్కుకుపోయారు. మంత్రిని రక్షించేందుకు రాష్ట్ర సర్కారు ఇంకా ఎలాంటి చర్యలు తీసుకోలేదు.