: ప్రింటింగ్ ప్రెస్ లో పనిచేసిన రేవంత్ రెడ్డికి అన్ని కోట్లెలా వచ్చాయి?: ఎంపీ బాల్క సుమన్
టీఆర్ఎస్ ఎంపీ, యువనేత బాల్క సుమన్ టీడీపీ తెలంగాణ ప్రాంత ఎమ్మెల్యే రేవంత్ రెడ్డిపై విరుచుకుపడ్డారు. కేసీఆర్ ముడుపులు తీసుకున్నట్టు రేవంత్ రెడ్డి చేసిన ఆరోపణలు అవాస్తవమని అన్నారు. రేవంతే పెద్ద అవినీతిపరుడని సుమన్ ఆరోపించారు. ప్రింటింగ్ ప్రెస్ లో పనిచేసిన రేవంత్ కు అన్ని కోట్ల రూపాయలు ఎక్కడి నుంచి వచ్చాయని ఈ యువనేత ప్రశ్నించారు. జూబ్లీహిల్స్ లోని బంగ్లా నిర్మాణానికి డబ్బులు ఎక్కడివో చెప్పాలని నిలదీశారు. ఉద్యమకారులపై తుపాకీతో దాడి చేసిన వ్యక్తి రేవంత్ అని విమర్శించారు. రేవంత్ జీవితం యావత్తూ బ్లాక్ మెయిల్ చేసి పబ్బం గడుపుకోవడంతోనే సరిపోయిందని ఆరోపించారు. కేసీఆర్ ముడుపులు తీసుకున్నట్టు నిరూపించలేకపోతే నాలుక కోస్తామని, సుమన్ మీడియాతో మాట్లాడిన సందర్భంగా రేవంత్ ను హెచ్చరించారు.