: మనమ్మాయిలకు తల్లులే ప్రథమ శత్రువులట!


భారత్ లో తల్లీకూతుళ్ళ మధ్య సంబంధాలపై యునిసెఫ్ ఓ అధ్యయనం చేపట్టింది. దాంట్లో పలు ఆసక్తికర విషయాలు వెల్లడయ్యాయి. అమ్మాయిలకు వారి తల్లులు, సవతి తల్లులే ప్రథమ శత్రువులని నివేదికలో తేలింది. కూతుళ్ళను వారే ఎక్కువగా శారీరకంగా హింసిస్తారట. 15 నుంచి 19 ఏళ్ళ మధ్య వయసు ఉన్నవారిని పరిశీలించగా... 41 శాతం మంది అమ్మాయిలు వారి తల్లులు, సవతి తల్లుల చేతిలోనే అధికంగా భౌతిక హింసకు గురవుతున్నారని తెలిసింది. 18 శాతం మంది బాలికలు వారి తండ్రులు, సవతి తండ్రుల చేతిలో దండనకు గురవుతున్నారట. క్రమశిక్షణ పేరిట ఈ హింస కొనసాగుతోందని యునిసెఫ్ పేర్కొంది. కాగా, 25 శాతం మంది అమ్మాయిలు వారి సోదరులు, సోదరీమణుల చేతిలో దెబ్బలు తింటున్నారని కూడా ఈ అధ్యయనం ద్వారా వెల్లడైంది. ఇక, వివాహితుల విషయానికొస్తే, 33 శాతం మంది భర్తల చేతిలో హింసకు గురువుతున్నారని, ఒక్క శాతం మంది మాత్రమే అత్తల చేతిలో దెబ్బలు తింటున్నారని నివేదిక చెబుతోంది. దీనిపై యునిసెఫ్ ఎగ్జిక్యూటివ్ డైరక్టర్ ఆంథోనీ లేక్ మాట్లాడుతూ, "ఈ వాస్తవాలు వినడానికి దుర్భరంగా ఉన్నాయి. ఏ తల్లిగానీ, తండ్రిగానీ, ఏ ప్రభుత్వం అయినా ఇలాంటి హింసను ఎవరూ కోరుకోరు" అని వ్యాఖ్యానించారు.

  • Loading...

More Telugu News