: కోనసీమ క్రికెట్ జట్టిది... వినాయకుళ్ళే ఆటగాళ్ళు!
వినాయకచవితి సందర్భంగా తూర్పుగోదావరి జిల్లా అమలాపురంలో గణేశ్ మంటపాన్ని వినూత్నరీతిలో ఏర్పాటు చేశారు. 11 వినాయక ప్రతిమలతో కూడిన క్రికెట్ జట్టును ఈ మంటపంలో ఏర్పాటు చేశారు. పచ్చని మైదానం... దాని మధ్యలో ఎర్రని పిచ్... ఫీల్డర్లు... బ్యాట్స్ మెన్... వికెట్ కీపర్... ఇలా సర్వం గణపతి మయం! గోలకోటి మాధవ్ అనే యువ కాస్ట్యూమ్ డిజైనర్ రూపొందించాడీ క్రికెట్ వినాయక సెటప్ ను. దీనిపై ఆయన మాట్లాడుతూ, దీన్ని తయారుచేసిన కొన్ని గంటల్లోనే అమ్ముడైందని తెలిపారు. ఇంటినుంచి షాపుకు తీసుకెళ్ళకముందే కొనేశారని వివరించారు.