: ఇంగ్లండ్ టూర్ ను మనవాళ్ళు విజయంతో ముగిస్తారా?... రేపు ఏకైక టి20 పోరు
మనవాళ్ళు ఇంగ్లండ్ గడ్డపై టెస్టు సిరీస్ ఓడారు, వన్డే సిరీస్ గెలిచారు! ఈ టూర్లో మరొక్క ఫార్మాట్ మిగిలి ఉంది. అందులో భాగంగా... టీమిండియా, ఇంగ్లండ్ మధ్య ఏకైక టి20 మ్యాచ్ రేపు జరగనుంది. ఈ పోరుకు బర్మింగ్ హాం వేదిక. కాగా, సుదీర్ఘమైన ఈ పర్యటనను ధోనీ సేన విజయంతో ముగించాలని భావిస్తోంది. ఐపీఎల్ అనుభవం రీత్యా, ఈ మినీ ఫార్మాట్లో ఇంగ్లండ్ కంటే భారత్ అన్ని రంగాల్లో బలంగా కనిపిస్తోంది.