: ఢిల్లీలో ప్రభుత్వ ఏర్పాటు విషయంలో రాష్ట్రపతి జోక్యం కోరనున్న 'ఆప్'
ఢిల్లీలో ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు బీజేపీ ప్రయత్నిస్తుండడాన్ని ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్ తప్పుబట్టారు. ఎలాంటి పరిస్థితుల్లోనూ ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు ఆ పార్టీని లెఫ్టినెంట్ గవర్నర్ ఆహ్వానించకుండా, రాష్ట్రపతి జోక్యం చేసుకోవాలని కేజ్రీవాల్ అన్నారు. ఈ మేరకు తాము రాష్ట్రపతి ప్రణబ్ ను కోరతామన్నారు. "ఢిల్లీలో బీజేపీ ప్రభుత్వాన్ని ఎలా ఏర్పాటుచేస్తుంది? కానీ, ఎమ్మెల్యేలను కొని ప్రభుత్వం ఏర్పాటు చేయాలని బీజేపీ కోరుకుంటోంది" అని ఆరోపించారు.