: తెలంగాణలో విద్యుత్ ఉత్పత్తి ప్రాజెక్టు ఏర్పాటు చేయాలని కేంద్రాన్ని కోరిన కేసీఆర్
ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు ఢిల్లీ పర్యటనలో పలువురు కేంద్రమంత్రులను కలుస్తున్నారు. రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీతో సమావేశం ముగిసిన అనంతరం కేసీఆర్ కేంద్ర విద్యుత్ మంత్రి పియూష్ గోయెల్ ను కలిశారు. రాష్ట్రంలో నెలకొన్న విద్యుత్ సమస్యలపై వివరించిన ఆయన, తెలంగాణలో నాలుగువేల మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి ప్రాజెక్టు ఏర్పాటు చేయాలని కోరారు. విద్యుత్ ప్రాజెక్టులకు సరిపడా బొగ్గు కేటాయింపులు కూడా చేయాలని అడిగారు. స్పందించిన విద్యుత్ మంత్రి తెలంగాణకు కోల్ బ్లాక్ లు కేటాయిస్తామని, విద్యుత్ ప్రాజెక్టుకు ఏర్పాటుకు మరింత స్థలాన్ని ఇస్తే నిర్మాణ పనులు చేపడతామని చెప్పినట్లు సమాచారం.