: మీ ఇష్టం మీ ఇంట్లో చెల్లుతుంది...శాసనసభలో కాదు: బాబు


తాను ఏడు సార్లు ఎమ్మెల్యేగా శాసనసభకు ఎన్నికయ్యానని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు తెలిపారు. శాసనసభలో ఆయన మాట్లాడుతూ, శాసనసభ నియమాలపై అవగాహన లేకుండా ప్రతిపక్ష నేత మాట్లాడుతున్నారని అన్నారు. శాసనసభలో ఎప్పుడైనా ఏ అంశంపైనైనా ప్రకటన చేసే అధికారం ప్రభుత్వానికి ఉంటుందని ఆయన తెలిపారు. రూల్స్ బుక్ చదివితే అన్నీ తెలుస్తాయని బాబు సూచించారు. తొలిసారి ఎన్నికైన ప్రతిపక్షనేతలు దౌర్జన్యం చేసి సాధించుకుందామంటే కుదరదని ఆయన తెలిపారు. మీ ఇష్టం మీ ఇంట్లో చెల్లుబాటవుతుందని, శాసనసభలో కుదరదని ఆయన స్పష్టం చేశారు.

  • Loading...

More Telugu News