: జమ్మూకాశ్మీర్ వరదల్లో కొట్టుకుపోయిన జవాన్లు
జమ్మూకాశ్మీర్ వరదల్లో తొమ్మిది మంది జవాన్లు కొట్టుకుపోయారు. పుల్వామాలో సహాయక చర్యల్లో పాల్గొనేందుకు వెళ్లిన సమయంలో ఇలా జరిగింది. జవాన్లను రక్షించేందుకు ప్రస్తుతం ఆర్మీ సైనికుల రెస్క్యూ కార్యకలాపాలు కొనసాగుతున్నాయి. మరోవైపు దక్షిణ శ్రీనగర్ ప్రాంతాల్లో, విమానాశ్రయానికి వెళ్లే ప్రాంతంలోనూ అధికారులు రెడ్ అలర్ట్ ప్రకటించారు.