: ప్రపంచ మేయర్ల సదస్సుకు మోడీని ఆహ్వానించిన కేసీఆర్


ఢిల్లీలో ప్రధానమంత్రి నరేంద్రమోడీతో ముఖ్యమంత్రి కేసీఆర్ సమావేశం ముగిసింది. అక్టోబర్ లో తెలంగాణలో జరగనున్న ప్రపంచ మేయర్ల సదస్సుకు ముఖ్యఅతిథిగా రావాలని మోడీని ఈ సందర్భంగా ఆహ్వానించారు. దాదాపు అర్థగంట పాటు జరిగిన సమావేశంలో ఇరవైఒక్క అంశాలపై పీఎంతో కేసీఆర్, పార్టీ ఎంపీలు చర్చించారు. వాటిలో తెలంగాణకు పన్ను రాయితీ, ప్రత్యేక హోదా, హైకోర్టు విభజన, విద్యుత్ సహా మిగతా అంశాలపై వివరించామని పార్టీ ఎంపీ జితేందర్ మీడియాకు తెలిపారు.

  • Loading...

More Telugu News