: జమ్మూకాశ్మీర్ వరదల్లో వంద మంది మృతి... నేడు రాజ్ నాథ్ పర్యటన


జమ్మూకాశ్మీర్ లో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా జనజీవనం స్తంభించిపోయింది. అటు వరదలు రాష్ట్రాన్ని ముంచెత్తుతున్నాయి. ఈ క్రమంలో మృతుల సంఖ్య పెరిగి ఇప్పటివరకు వంద మంది సాధారణ పౌరులు మరణించారు. కేంద్ర హోంమంత్రి రాజ్ నాథ్ సింగ్ ఈరోజు ఆ రాష్ట్రంలో పర్యటించనున్నారు. వరదలకు బాగా దెబ్బతిన్న ముఖ్య ప్రాంతాలు పూంచ్, రాజౌరి, అనంతనాగ్ జిల్లాలను ఏరియల్ సర్వే ద్వారా మంత్రి పరిశీలించనున్నారు. అనంతరం ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లాతో వరదలపై సమీక్ష కార్యక్రమం నిర్వహించనున్నారు.

  • Loading...

More Telugu News