: ఏపీ శాసనసభలో కాగ్ నివేదిక... ప్రభుత్వరంగ సంస్థల్లోని లోటుపాట్లు వెల్లడి
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ అనుమతితో కాగ్ (కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్) తన నివేదికను శాసనసభలో ఈ ఉదయం ప్రవేశపెట్టింది. ప్రభుత్వరంగ సంస్థలు, సామాజిక, ఆర్థిక రంగాలపై కాగ్ తన నివేదికను సమర్పించింది. ఇందులో ప్రభుత్వరంగ సంస్థల్లోని అనేక లోటుపాట్లను కాగ్ వెల్లడించింది. గోదావరి, వంశధార, నాగావళి వరదకట్టల పనుల్లో ప్రణాళిక లేదని, దానివల్ల 66 కట్టల పనుల్లో ఇంకా 48 కట్టల పనులు పూర్తి కాలేదంది. ఈ క్రమంలో రూ.944 కోట్ల మేర వరద కట్టల పనులు నిలిచిపోయాయని కాగ్ తెలిపింది. ఇక ఆర్ అండ్ బి శాఖలో పీపీపీ విధానం ప్రాజెక్టుల్లో ప్రమాణాలు పాటించలేదని వివరించింది. ఐటీ వినియోగంలో సేవా కేంద్రాల ఏర్పాటుకు నిబంధనలు పాటించడం లేదని తెలిపింది. మూలనపడిన ఎత్తిపోతల పథకాలను పునరుద్ధరించాలని కాగ్ చెప్పింది.