: బకాయిలు చెల్లించాలని కోరుతూ జాతీయ రహదారి దిగ్బంధం


ఎంసీఎస్ చక్కెర కర్మాగారం బకాయిలు చెల్లించాలని డిమాండ్ చేస్తూ చెరకు రైతులు 36వ జాతీయ రహదారిని దిగ్బంధించారు. విజయనగరం జిల్లా సీతానగరం మండలం చినబోగిలి వద్ద ఆందోళన నిర్వహించిన రైతులు అర్ధరాత్రి అరెస్టు చేసిన రైతు సంఘం నేతలను విడుదల చేయాలని డిమాండ్ చేశారు. తమ బకాయిలు పూర్తిగా చెల్లించేవరకు ఆందోళన ఆపేది లేదని వారు స్పష్టం చేశారు. రైతుల రహదారి దిగ్బంధంతో పార్వతీపురం-బొబ్బిలి మధ్య వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి.

  • Loading...

More Telugu News