: ఢిల్లీలో కేసీఆర్ నివాసం వద్ద తెలంగాణ జర్నలిస్టుల ధర్నా


ముఖ్యమంత్రి కేసీఆర్ ఢిల్లీ పర్యటన సందర్భంగా టీవీ9, ఏబీఎన్ ప్రసారాల నిలిపివేతపై తెలంగాణ జర్నలిస్టులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రాజధానిలో ఆయన నివాసం వద్దకు పెద్ద సంఖ్యలో తరలివచ్చిన జర్నలిస్టులు ధర్నా చేస్తున్నారు. మూతికి నల్లని వస్త్రాలు కట్టుకుని నిరసన చేబట్టారు. మీడియా స్వేచ్ఛకు సంకెళ్లు వద్దని నినాదాలు చేస్తున్నారు. చానెళ్ల ప్రసారాలను వెంటనే పునరుద్ధరించాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ క్రమంలో పోలీసులు భారీగా మోహరించారు.

  • Loading...

More Telugu News