: హత్య కేసులో నటి శ్రుతి బెంగళూరులో అరెస్టు
తమిళ సినీ నటుడు రేనాల్డ్ పీటర్ ప్రిన్స్ హత్య కేసులో నటి శ్రుతిని బెంగళూరులో పోలీసులు అరెస్టు చేశారు. తమిళనాడు నెల్లై జిల్లాకు చెందిన రేనాల్డ్ పీటర్ ప్రిన్స్ (36) కంప్యూటర్ సెంటర్లు, ఆన్ లైన్ వ్యాపారం చేస్తూ బాగా సంపాదించాడు. కోలీవుడ్ లో పలు సినిమాలకు ఫైనాన్స్ చేస్తూ సినీనటుడిగా స్థిపరడ్డారు. ఈ క్రమంలో బెంగళూరుకు చెందిన నటి శ్రుతి చంద్రలేఖతో రేనాల్డ్ కు పరిచయం ఏర్పడింది. అతని వద్ద బాగా డబ్బున్న విషయం తెలుసుకున్న శ్రుతి గత జనవరిలో రేనాల్డ్ ను కారులో కిడ్నాప్ చేసి హత్య చేశారు. పాళయంకోటలో అతని మృతదేహం పాతిపెట్టి ఏమీ తెలియనట్టు, రేనాల్డ్ పీటర్ కనిపించడం లేదని పోలీసులకు ఫిర్యాదు చేసింది. తరువాత కొంత కాలానికి రేనాల్డ్ పీటర్ కారు వేరే వ్యక్తి వాడుతూ అతని సోదరుడికి కనిపించాడు. దీంతో అతను తీగలాగి, శ్రుతి నిర్వాకంపై పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అసలు రంగు బయటపడడంతో ఆమె పరారైంది. గత ఎనిమిది నెలలుగా అజ్ఞాతంలో ఉన్న శ్రుతి బెంగళూరులో ఉన్నట్టు సమాచారం అందడంతో పోలీసులు ఆమెను అరెస్టు చేసి కోర్టులో హాజరుపరిచారు. న్యాయమూర్తి ఆదేశాల మేరకు ఆమెను జైలుకు తరలించారు.