: ఫేస్ బుక్ లో కొత్త సౌకర్యం


యువతను ఎక్కువగా ఆకర్షిస్తున్న సామాజిక అనుసంధాన వేదిక ఫేస్ బుక్ వినియోగదారులకు ఒక కొత్త సౌకర్యాన్ని అందుబాటులోకి తెచ్చింది. ప్రపంచ వ్యాప్తంగా 120 కోట్ల మంది వినియోగదారులు కలిగిన ఫేస్ బుక్ తమ సమాచారాన్ని ఎవరితో పంచుకుంటున్నామో... ఎవరితో పంచుకోవాలో... సమీక్షించుకుని, నియంత్రించుకునేందుకు ప్రైవసీ చెకప్ ను అందుబాటులోకి తెచ్చింది. దీని సాయంతో మీరు కోరుకున్న వ్యక్తులకు మాత్రమే మీ సమాచారం అందుబాటులో ఉంచొచ్చు. దీనిని ఉపయోగించి వినియోగదారులు తమ పోస్టులకు సంబంధించిన వీక్షకులను సులువుగా మార్చివేయొచ్చని ఫేస్ బుక్ తెలిపింది. పాత యాప్స్ తొలగించి, కొత్త యాప్స్ జోడించుకోవచ్చని ఫేస్ బుక్ స్పష్టం చేసింది.

  • Loading...

More Telugu News