: ఫేస్ బుక్ లో సర్వేపల్లి అరుదైన ఒరిజనల్ ఫోటో


ఉపాధ్యాయ దినోత్సవాన్ని పురస్కరించుకుని మాజీ రాష్ట్రపతి సర్వేపల్లి రాధాకృష్ణన్ అరుదైన చిత్రాన్ని ఫేస్‌బుక్‌లో పెట్టామని తూర్పుగోదావరి జిల్లా కొత్తపేటకు చెందిన అద్దంకి బుద్ధచంద్రదేవ్ (ఏబీసీ దేవ్) తెలిపారు. ప్రియదర్శినీ బాలవిహార్ వ్యవస్థాపకుడు అద్దంకి కేశవరావు ఎన్నో అరుదైన చిత్రాలు, గ్రంథాలను సేకరించి తన లైబ్రరీలో భద్రపరిచారు. వాటిల్లో 1962లో రాధాకృష్ణన్ శాలువా కప్పుకుని కుర్చీలో కూర్చున్న ఒరిజినల్ ఫొటో కూడా ఉంది. ఈ ఫోటోను ఆయన ఫేస్‌బుక్ ఫాలోవర్ల కోసం పోస్టు చేశారు. సర్వేపల్లి ఫోటోకు ఫేస్ బుక్ లో విశేషమైన ఆదరణ లభించినట్టు ఆయన తెలిపారు.

  • Loading...

More Telugu News