: గణేష్ నిమజ్జనానికి 30 వేల మందితో బందోబస్తు: మహేందర్ రెడ్డి


వినాయకచవితి సందర్భంగా హైదరాబాద్ లో ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించే గణేష్ సామూహిక నిమజ్జనోత్సవం సందర్భంగా భద్రత నిమిత్తం జంటనగరాల్లో 30 వేల మంది పోలీసులను నియమించినట్టు హైదరాబాద్ పోలీస్ కమిషనర్ మహేందర్‌రెడ్డి వెల్లడించారు. హైదరాబాదులో ఆయన మాట్లాడుతూ, గణేష్ నిమజ్జనోత్సవం సందర్భంగా ట్రాఫిక్, సెక్యూరిటీ, ఇన్వెస్టిగేషన్, లా అండ్ ఆర్డర్ తదితర విభాగాల పోలీసు సిబ్బందిని వినియోగిస్తున్నట్టు తెలిపారు. ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన కంట్రోల్‌రూమ్ ద్వారా ఆయా ప్రాంతాల్లోని సమస్యలను పరిష్కరించేలా చర్యలు చేపడుతున్నామని ఆయన చెప్పారు. అశ్లీలతకు తావు లేకుండా ఉండేలా నిమజ్జనోత్సవంలో డీజేలను నిషేధించామని స్పష్టం చేశారు. ప్రధాన కూడళ్లలో రహదారి నియంత్రణ చర్యలు చేపట్టామని ఆయన వెల్లడించారు. ట్రాఫిక్ ఆంక్షలకు ప్రజలు సహకరించాలని ఆయన కోరారు.

  • Loading...

More Telugu News