: విమాన యానం ఇండియాలోనే చవక!
విమాన యానం భారతదేశంలోనే అత్యంత చవక. ఈమధ్య కాలంలో భారత విమానయాన సంస్థలు ఆఫర్ల వెల్లువ ప్రకటించిన సంగతి తెలిసిందే. విమానయాన సంస్థలు ప్రకటించిన ఆఫర్లలో వచ్చే ఏడాది ఆరు నెలల వరకు దిగువ శ్రేణి విమానం టికెట్లు బుక్కైపోయాయని సమాచారం. 100, 498, 599, 999, 1878, 19998 రూపాయలకే విమాన టిక్కెట్ అంటూ పలు విమాన సంస్థలు ప్రత్యేక ఆఫర్లు, తక్కువ మొత్తంతో విదేశీయానం అంటూ సందడి చేసిన సంగతి తెలిసిందే. దీంతో భారతీయ విమానయాన రంగం అత్యంత చవకైన విమానయానంగా పేరు సంపాదించింది. ప్రపంచంలో అత్యంత చౌకగా విమానంలో ప్రయాణించే సదుపాయం భారత్లోనే ఉందని ఆస్ట్రేలియా పత్రిక సిడ్నీ మార్నింగ్ హెరాల్డ్ చేసిన పరిశోధనలో వెల్లడైంది. భారత్ తరువాతి స్థానాల్లో మలేసియా, దక్షిణాఫ్రికా దేశాలు నిలిచాయి. ప్రపంచంలో విమానయానంలో అత్యంత ఖరీదైన దేశం ఫిన్లాండ్. దాని తరువాతి స్థానాల్లో స్విట్జర్లాండ్, లుథానియా, ఆస్ట్రియా, ఈస్టోనియా ఉన్నాయి.