: హాఫ్ సెంచరీ చేసి, ఔట్ అయిన అంబటి రాయుడు
లీడ్స్ వన్డేలో భారత్ ఐదో వికెట్ కోల్పోయింది. ఆదిలోనే భారత్ మూడు వికెట్లు చేజార్చుకున్న దశలో... అంబటి రాయుడు నిలకడగా ఆడుతూ హాఫ్ సెంచరీని పూర్తి చేసి ఔట్ అయ్యాడు. 65 బంతుల్లో రెండు సిక్సర్లు, 3 ఫోర్లతో రాయుడు 53 పరుగులు చేశాడు. క్రీజులో ధోనీ (23), రవీంద్ర జడేజా (8) కొనసాగుతున్నారు. 33.3 ఓవర్లలో భారత్ స్కోర్ 151/5. ఐదు వన్డేల సిరీస్ లో 3-0 ఆధిక్యంతో సిరీస్ కైవసం చేసుకున్న భారత్... ఈ చివరి వన్డేలో గెలవడం కష్టమే.