: గణేశ్ నిమజ్జనం సందర్భంగా ఈ నెల 8న సెలవు ప్రకటించిన ప్రభుత్వం
గణేశ్ నిమజ్జనం సందర్భంగా ఈ నెల 8వ తేదీ (సోమవారం)న ప్రభుత్వం సెలవు ప్రకటించింది. హైదరాబాదు, రంగారెడ్డి జిల్లాల్లోని ప్రభుత్వ కార్యాలయాలకు సోమవారం నాడు సెలవుదినంగా ప్రభుత్వం పేర్కొంది. ప్రభుత్వోద్యోగులు 8వ తేదీ బదులుగా 13వ తేదీన పనిచేయాల్సి ఉంటుంది. హైదరాబాదు, రంగారెడ్డి జిల్లాల్లోని ప్రభుత్వ కార్యాలయాలు 13వ తేదీ (రెండవ శనివారం) నాడు పనిచేయనున్నాయి.