: లవ్ జీహాద్ పదం వాడకుండా చూడండి: కోర్టులో వ్యాజ్యం


'లవ్ జీహాద్' అనే పదం వాడకుండా నిరోధించాలని, 'లవ్ జీహాద్'పై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన బీజేపీ ఎంపీ యోగి ఆదిత్యనాథ్ పై చర్యలు తీసుకోవాలని కోరుతూ అలహాబాద్ హైకోర్టులో దాఖలైన ప్రజాప్రయోజన వ్యాజ్యంపై న్యాయస్థానం స్పందించింది. దీనిపై ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం, జాతీయ ఎన్నికల కమిషన్ లు పది రోజుల్లోగా కౌంటర్లు దాఖలు చేయాల్సిందిగా న్యాయస్థానం ఆదేశించింది. కాగా, ముస్లిం యువకులు ప్రేమ పేరిట హిందూ యువతులకు వల వేసి మతమార్పిడులకు పాల్పడుతున్నారని బీజేపీ ఆరోపిస్తుండగా, ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం 'లవ్ జీహాద్' అనేదే లేదని అంటోంది.

  • Loading...

More Telugu News