: తెలంగాణ సంధి సమయంలో ఉంది: కేసీఆర్


తెలంగాణ సంధి సమయంలో ఉందని, వందేళ్లుగా తెలంగాణ కన్నీరు పెడుతోందని టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అన్నారు. తుమ్మల నాగేశ్వరరావు టీఆర్ఎస్ లో చేరిన సందర్భంగా కేసీఆర్ మాట్లాడుతూ... తుమ్మల తనకు చాలా సన్నిహితులని, దీర్ఘకాలం కలిసి పనిచేశామని అన్నారు. ఖమ్మం జిల్లా తెలంగాణకు తలమానికమని అన్నారు. జిల్లా నేతలను సమన్వయం చేసుకుని పార్టీని ముందుకు తీసుకెళ్లాలని తుమ్మలను కోరుతున్నానని ఆయన చెప్పారు. దేశ రాజకీయ వ్యవస్థను ఒప్పించి తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడిందన్నారు. ఇప్పుడు తెలంగాణ పునర్నిర్మాణం జరుగుతుందని కేసీఆర్ చెప్పారు. బంగారు తెలంగాణ కోసం పాటుపడదామని ఆయన అన్నారు. తుమ్మల రాజకీయ దురంధరుడు అని, ఖమ్మం జిల్లాలో పార్టీని ముందుకు తీసుకెళ్లేందుకు ఆయన ప్రధాన బాధ్యత తీసుకోవాలని కేసీఆర్ కోరారు. తుమ్మల సుదీర్ఘ రాజకీయ జీవితంలో ఎలాంటి మచ్చ లేని వ్యక్తి అని, నీతి నిజాయతీ కలిగిన, సమర్థ, విశ్వసనీయత కలిగిన నాయకుడని కేసీఆర్ ఆయనను ప్రశంసలతో ముంచెత్తారు. ఖమ్మం జిల్లాను అభివృద్ధి చేయాల్సిన బాధ్యత మనందరిది అని ఆయన చెప్పారు. త్వరలో కొత్తగూడెం కేంద్రంగా కొత్త జిల్లా ఏర్పాటవుతుందన్నారు.

  • Loading...

More Telugu News