: ఇండియాలో మహిళల పరిస్థితిపై ఐక్యరాజ్యసమితి ఆందోళన
భారతదేశంలో మహిళల పరిస్థితిపై ఐక్యరాజ్యసమితి ఆందోళన వ్యక్తం చేసింది. భారతదేశంలో 15 నుంచి 19 ఏళ్లలోపు ఆడపిల్లల్లో 77 శాతం మంది తమ భర్త లేదా భాగస్వామి వల్ల లైంగిక హింసకు గురవుతున్నారని యునిసెఫ్ నివేదిక తెలుపుతోందని ఐక్యరాజ్యసమితి తెలిపింది. వారిలో సగం మంది తల్లిదండ్రుల వల్ల కూడా శారీరక హింసకు గురవుతున్నారని నివేదిక వెల్లడించింది. 15 నుంచి 19 ఏళ్లలోపు పెళ్లైన ఆడపిల్లల్లో 34 శాతం మంది లైంగిక, శారీరక, మానసిక హింసకు గురవుతున్నారని, దక్షిణాసియా దేశాల్లో ప్రతి ఐదుగురు ఆడపిల్లల్లో ఒకరు హింసకు గురవుతున్నారని ఆ నివేదిక స్పష్టం చేసింది. భారతదేశం, బంగ్లాదేశ్ లలోనే ఈ రకమైన హింస ఎక్కువగా చోటుచేసుకుంటోందని నివేదిక తెలిపింది.