: కట్టుకున్న భార్యను కిరాతకంగా హత్య చేసిన భర్త
హైదరాబాదులో కట్టుకున్న భార్యను ఓ భర్త కిరాతకంగా హత్య చేశాడు. కూకట్ పల్లి హౌసింగ్ బోర్డు పీఎస్ పరిధిలో ఈ ఘటన జరిగింది. సమతానగర్ లో భానుప్రకాశ్ అనే వ్యక్తి తన భార్యను హత్య చేసిన అనంతరం పోలీస్ స్టేషన్ లో లొంగిపోయాడు. భానుప్రకాష్ సస్పెన్షన్ లో ఉన్న ఎస్సై అని తెలిసింది. కుటుంబ కలహాలే ఈ హత్యకు కారణమని తెలుస్తోంది. నిందితుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు.