: విద్యార్థులకు భగవద్గీతను బహుమతిగా ఇచ్చిన మోడీ
ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా విద్యార్థులతో ప్రధాని నరేంద్ర మోడీ ముఖాముఖి కార్యక్రమంలో పలువురు విద్యార్థులు సర్వేపల్లి రాధాకృష్ణన్ మహోన్నత వ్యక్తిత్వం గురించి మాట్లాడారు. గురుపూజోత్సవ ఔన్నత్యాన్ని వారు తమ మాటల్లో వివరించారు. రాధాకృష్ణన్ నిరాడంబరత అందరికీ ఆదర్శం కావాలని విద్యార్థులు చెప్పిన తీరు ప్రధానిని ఆకట్టుకుంది. ప్రధాని మోడీ వారికి బహుమతిగా భగవద్గీత పుస్తకాలను అందించారు.