: ఆంధ్రప్రదేశ్ లో బదిలీలపై నిషేధాన్ని పొడిగిస్తూ ఉత్తర్వులు
ఏపీలో బదిలీలపై నిషేధాన్ని పొడిగిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. సెప్టెంబరు 30 నుంచి అక్టోబరు 10 వరకు బదిలీలపై నిషేధం విధించారు. టీచర్లు, ఎన్జీవోలలో 20 శాతం మంది బదిలీలకే అనుమతి లభించింది. బదిలీ ప్రక్రియను కౌన్సెలింగ్ ద్వారా చేపట్టాలని నిర్ణయించారు. బదిలీల్లో దంపతులు, వికలాంగులకు ప్రాధాన్యతనివ్వాలని నిర్ణయం తీసుకున్నారు.