: ఆస్ట్రేలియా ప్రధానికి ఘనస్వాగతం పలికిన నరేంద్రమోడీ
భారత్ లో రెండు రోజుల పర్యటన నిమిత్తం ఆస్ట్రేలియా ప్రధాని టోనీ అబ్బాట్ ఇవాళ ఢిల్లీకి విచ్చేశారు. ఆయనకు రాష్ట్రపతి భవన్ లో ఘనస్వాగతం లభించింది. ఇవాళ ఉదయం రాష్ట్రపతి భవన్ వద్ద ప్రధాని నరేంద్ర మోడీ ఆయనను సాదరంగా ఆహ్వానించారు. ‘ఆస్ట్రేలియా ప్రధానికి సాదర స్వాగతం. ఈ పర్యటన భారత్, ఆస్ట్రేలియాల మధ్య సత్సంబంధాలను బలపరుస్తుందని నమ్ముతున్నానని’ మోడీ ట్విట్టర్ లో పేర్కొన్నారు. అలాగే టోనీ అబ్బాట్ కూడా భారత ప్రధాని అధికారిక స్వాగతం పలికారని ట్వీట్ చేశారు.