: రఘువీరారెడ్డిపై మండిపడ్డ జేసీ ప్రభాకర్ రెడ్డి
ఆంధ్రప్రదేశ్ పీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డిపై తాడిపత్రి ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి మండిపడ్డారు. మంత్రిగా ఉన్నప్పుడు ఏనాడూ సమైక్యరాష్ట్రం గురించి మాట్లాడని రఘువీరా... ఇప్పుడు మాత్రం రాజధాని ఎక్కడ పెట్టాలనే దానిపై అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేయాలని అడుగుతున్నారని... అలా అడిగే హక్కు ఆయనకు లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజకీయాల్లోకి వచ్చి ఇన్నేళ్లయినా... అనంతపురం జిల్లాకు రఘువీరా చేసిందేమీ లేదని మండిపడ్డారు. మైకుల ముందు అవాకులు చెవాకులు పేలడం ఇకనైనా మానుకోవాలని రఘువీరాకు ప్రభాకర్ రెడ్డి హితవు పలికారు.