: స్టూవర్ట్ బ్రాడ్, మాట్ ప్రయర్ లకు శస్త్రచికిత్సలు


టీమిండియాతో టెస్టు సిరీస్ సందర్భంగా గాయాలపాలైన ఇంగ్లండ్ పేసర్ స్టూవర్ట్ బ్రాడ్, వికెట్ కీపర్ మాట్ ప్రయర్ లకు శస్త్రచికిత్సలు నిర్వహించారు. రానున్న వన్డే ప్రపంచకప్ ను దృష్టిలో ఉంచుకుని వారిద్దరికీ మెరుగైన వైద్యం అందించాలని ఇంగ్లండ్ అండ్ వేల్స్ క్రికెట్ బోర్డు (ఈసీబీ) నిర్ణయించింది. ఈ క్రమంలో గురువారం బ్రాడ్ కు మోకాలి ఆపరేషన్, ప్రయర్ కు ఎడమకాలి మడమకు శస్త్రచికిత్స నిర్వహించారు. మరో నాలుగు నెలల్లో వీరు పూర్తి ఫిట్ నెస్ సాధిస్తారని ఈసీబీ వర్గాలు భావిస్తున్నాయి. గతకొంతకాలంగా వీరిద్దరూ గాయాలతోనే ఆటలో పాల్గొంటున్నారు.

  • Loading...

More Telugu News