: మూడున్నర దశాబ్దాల క్రితం తనతో నటించిన బాలనటుడి కోసం మోహన్ లాల్ అన్వేషణ


మలయాళంలో మోహన్ లాల్ ఓ సూపర్ స్టార్. ప్రతిష్ఠాత్మక 'పద్మశ్రీ'తో పాటు జాతీయ అవార్డులు, ఫిలింఫేర్ పురస్కారాలు ఈ నటుడి ప్రతిభకు తార్కాణాలు. 1978లో మోహన్ లాల్ తెరంగేట్రం చేశారు. ఆ ఏడాది సెప్టెంబర్ 3న 'తిరణోట్టమ్' సినిమాకు సంబంధించి ఆయన తొలిసారి కెమెరా ముందుకు రాగా... ఆ షాట్ లో లాల్ తో పాటు మరో బాలనటుడు కూడా నటించాడు. ఎప్పుడో 36 ఏళ్ళ క్రితం తనతో నటించిన ఆ చైల్డ్ ఆర్టిస్టు కోసం ఈ మలయాళ సూపర్ స్టార్ అన్వేషిస్తున్నారు . సెప్టెంబర్ 3వ తేదీని జీవితంలో మర్చిపోలేనని, తన జీవితం మలుపు తిరిగిన రోజని మోహన్ లాల్ తన ఫేస్ బుక్ పేజీలో పేర్కొన్నారు. సినిమా కల నెరవేరిన రోజని తెలిపారు. ఆ రోజు తనతో పాటు ఓ పిల్లవాడు కూడా షాట్ లో ఉన్నాడని, అతని గురించి ఎవరికైనా తెలిస్తే చెప్పండంటూ కోరారు. ఈ మేరకు తన తొలిషాట్ కు సంబంధించిన వీడియో క్లిప్ ను ఫేస్ బుక్ పోస్టుకు అటాచ్ చేశాడు. అతనిని కలవాలనుకుంటున్నానని, అతని వివరాలు గుర్తులేవని, అందుకే ఫేస్ బుక్ ద్వారా ఈ అన్వేషణ అని తెలిపారు. మోహన్ లాల్ తన కెరీర్లో ఇప్పటిదాకా 250కి పైగా సినిమాల్లో నటించారు.

  • Loading...

More Telugu News