: నేడు ప్రణబ్, మోడీలతో భేటీ కానున్న ఆస్ట్రేలియా ప్రధాని
ఆస్ట్రేలియా ప్రధానమంత్రి టోనీ అబాట్ భారత్ పర్యటన రెండో రోజుకు చేరుకుంది. ఈ రోజు ఆయన భారత రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ, ప్రధాని నరేంద్ర మోడీలతో భేటీ కానున్నారు. మోడీతో టోనీ అబాట్ జరిపే చర్చలు అత్యంత కీలకమని తెలుస్తోంది. ముఖ్యంగా అణు ఒప్పందంపై వీరిరువురూ ఒక అవగాహనకు వచ్చే అవకాశం ఉందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.