: విజయవాడలో సీఎం చంద్రబాబుకు ఘన స్వాగతం
నవ్యాంధ్రప్రదేశ్ కు కొత్త రాజధాని ప్రకటన తర్వాత తొలిసారి విజయవాడలో అడుగుపెట్టిన ముఖ్యమంత్రి చంద్రబాబుకు ఘన స్వాగతం లభించింది. కొద్దిసేపటి కిందట గన్నవరం విమానాశ్రయంలో దిగిన ఆయనకు అక్కడి నుంచి విజయవాడ వరకు పార్టీ స్థానిక నేతలు, కార్యకర్తలు స్వాగతం పలికారు. అటు నుంచి రోడ్డు మార్గం ద్వారా సీఎం గుంటూరు చేరుకుని అక్కడ జరిగే గురుపూజోత్సవ కార్యక్రమానికి హాజరుకానున్నారు.