: దేవాదాయశాఖ ఆధ్వర్యంలో ఇంజినీరింగ్, వైద్య కళాశాలలు: మంత్రి గంటా
ఆంధ్రప్రదేశ్ లో కొత్త తరహాలో కళాశాలలను నడిపేందుకు ప్రభుత్వం ఆలోచన చేస్తోంది. ఈ క్రమంలో విద్య, దేవాదాయ శాఖల ఆధ్వర్యంలో ఇంజినీరింగ్, వైద్య కళాశాలలను త్వరలో ఏర్పాటు చేయబోతున్నట్లు మంత్రి గంటా శ్రీనివాసరావు తెలిపారు. దేవాదాయ శాఖే ఈ కళాశాలల నిర్వహణ అంతా చూస్తుందని వెల్లడించారు. గుంటూరు జిల్లా తాడేపల్లిలో కోనేరు లక్ష్మయ్య విశ్వవిద్యాలయాన్ని ఈరోజు మంత్రి సందర్శించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ పైవిధంగా చెప్పారు.