: బోధించడం ఉద్యోగం కాదు... అది ఒక 'జీవన ధర్మం': మోడీ
టీచర్స్ డే సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్రమోడీ దేశవ్యాప్తంగా ఉన్న ఉపాధ్యాయులకు శుభాకాంక్షలు తెలిపారు. ఉత్తమ ఉపాధ్యాయులుగా రాష్ట్రపతి అవార్డులు దక్కించుకున్న 350 మంది టీచర్లను ఉద్దేశించి ఆయన తన నివాసంలో గురువారం ప్రసంగించారు. బోధించడం వృత్తి లేదా ఉద్యోగం కాదని... అది ఒక 'జీవన ధర్మమని' ఆయన వ్యాఖ్యానించారు. ప్రతి ఉపాధ్యాయుడికి తన విద్యార్థులను చూసి గర్వపడే రోజు రావాలని ఆయన ఆశించారు. గుజరాత్ ముఖ్యమంత్రి అయ్యాక తనకు పాఠాలు చెప్పిన ఉపాధ్యాయులను... సహవిద్యార్థులను పిలిచి సత్కరించానని ఆయన ఈ సందర్భంగా అన్నారు.