: వన్డే సిరీస్ క్లీన్ స్వీప్ పై ధోనీ సేన కన్ను!
ఇంగ్లండ్ తో టెస్టు సిరీస్ లో ఘోర పరాజయం పాలైన టీమిండియా, వన్డే సిరీస్ ను క్లీన్ స్వీప్ చేసే దిశగా సన్నాహాలు చేస్తోంది. ఇప్పటికే ఐదు వన్డేల సిరీస్ లో 3-0 ఆధిపత్యంతో సిరీస్ ను కైవసం చేసుకున్న ధోనీ సేన నేడు చివరి వన్డే ఆడనుంది. టీమిండియాలో దాదాపుగా అందరు ఆటగాళ్లు ఫుల్ ఫామ్ లోకి వచ్చారు. రైనా దూకుడును అడ్డుకునే ఇంగ్లండ్ బౌలర్ కనిపించడం లేదు. టెస్టు హీరోగా ముద్రపడ్డ రహానే నాలుగో వన్డేలో సెంచరీ నమోదు చేసి, తన సత్తా చాటాడు. రహానేను కట్టడి చేసేందుకు ఇంగ్లండ్ బౌలర్లు బాగానే శ్రమించినా ఫలితం మాత్రం కనిపించలేదు. భారత బౌలర్లు కూడా పూర్తి స్థాయిలో రాణిస్తుండటంతో టీమిండియా గెలుపు అవకాశాలపై ఎలాంటి సందేహాలు లేవు. సిరీస్ ను క్లీన్ స్వీప్ చేస్తే వన్డే ర్యాంకింగ్స్ లోనైనా టీమిండియా ర్యాంకు మెరుగయ్యే అవకాశాలున్నాయి.