: అత్యంత ఆర్భాటంగా నేడు టీఆర్ఎస్ లో చేరనున్న తుమ్మల నాగేశ్వరరావు


ఖమ్మం జిల్లా టీడీపీ సీనియర్ నాయకుడు తుమ్మల నాగేశ్వరరావు టీఆర్ఎస్ లో చేరేందుకు రంగం సిద్దమైంది. ఈరోజు సాయంత్రం 5 గంటలకు ముఖ్యమంత్రి కేసీఆర్ సమక్షంలో అత్యంత ఆర్భాటంగా జరిగే కార్యక్రమం ద్వారా ఆయన టీఆర్ఎస్ లో చేరనున్నారు. భారీ సంఖ్యలో ఉన్న ఆయన అనుచరులు, టీడీపీకి రాజీనామా చేసి తుమ్మలతో పాటు టీఆర్‌ఎస్‌లో చేరనున్నారు. సుమారు 3వేల వాహనాల్లో తుమ్మల అనుచరులు ఖమ్మం నుంచి హైదరాబాద్‌కు తరలిరానున్నారు. ఉదయం 9 గంటలకు ఖమ్మం నుంచి ఈ భారీ వాహన ర్యాలీ హైదరాబాద్ కు బయలుదేరుతుంది. ఎల్ బీ నగర్, ఉప్పల్ రింగ్ రోడ్, రైల్ నిలయం, బేగంపేట, ఎల్వీ ప్రసాద్ ఇన్ స్టిట్యూట్ మీదుగా తెలంగాణభవన్ వరకు ర్యాలీ కొనసాగుతుంది. ఈ నేపథ్యంలో, మధ్యాహ్నం 3 గంటలనుంచి తెలంగాణ భవన్ పరిసర ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. రెండురోజులుగా యశోద ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న తుమ్మల గురువారం రాత్రి 10.30కి డిశ్చార్జ్ అయ్యారు. ఆయనతో పాటుగా ఖమ్మం జిల్లాపరిషత్ చైర్మన్ గడిపల్లి కవిత, ఎమ్మెల్సీ బాలసాని, టీడీపీ జిల్లా మాజీ అధ్యక్షుడు కొండబాల కోటేశ్వరరావు, డీసీసీబీ చైర్మన్ మువ్వా విజయబాబు, డీసీఎంఎస్ చైర్మన్ ఎగ్గడి అంజయ్య తదితరులు టీఆర్ఎస్ పార్టీలో చేరనున్నారు.

  • Loading...

More Telugu News