: ముంబయిలో అమిత్ షా పర్యటన
ముంబయి నగరంలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా ఇవాళ పర్యటించారు. ముంబయి విమానాశ్రయానికి చేరుకున్న అమిత్ షాకు బీజేపీ నేతలు, కార్యకర్తలు ఘనస్వాగతం పలికారు. అనంతరం శివాజీ పార్కు మైదానంలోని బాల్ థాకరే స్మారకం వద్ద ఆయన నివాళులర్పించారు. తర్వాత బీజేపీ శ్రేణులతో ఆయన సమావేశమయ్యారు.