: స్నేక్ గ్యాంగ్ పై నిర్లక్ష్యం వహించిన సీఐ, ఎస్సై సస్పెన్షన్
హైదరాబాదులోని పాతబస్తీ పహడీషరీఫ్ లో స్నేక్ గ్యాంగ్ దురాగతాలపై పూర్తి సమాచారమున్నా వారి ఆటకట్టించడంలో నిర్లక్ష్యం వహించిన సీఐ, ఎస్ఐలను సైబరాబాద్ కమిషనర్ సీవీ ఆనంద్ సస్పెండ్ చేశారు. 37 మంది యువతుల్ని చెప్పుకోలేని రీతిలో వేధించిన స్నేక్ గ్యాంగ్ అరాచకాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తుండడంతో ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఐ భాస్కర్ రెడ్డి, ఎస్సై విఎస్ ప్రసాద్ నిందితుల పట్ల నిర్లక్ష్యం వహించారని ఆయన మండిపడ్డారు. కాగా, స్నేక్ గ్యాంగ్ కు కస్టడీ పెంచుతూ న్యాయస్థానం నిర్ణయం తీసుకుంది.