: పాక్ లో భారీ వర్షాలు... 40 మంది మృతి
పాకిస్థాన్ లో కురిసిన భారీ వర్షాలకు 40 మంది మరణించారు. ఈ విషయాన్ని ఆ దేశ పోలీస్ అధికారి ఒకరు ఇవాళ వెల్లడించారు. వారిలో 25 మంది పంజాబ్ రాష్ట్రంలో మంగళవారం రాత్రి కురిసిన వర్షాలకు ఇంటి కప్పులు కూలిపోవడంతో మృత్యువాత పడ్డారని, మిగిలిన 15 మంది వరదల వల్ల ప్రాణాలు కోల్పోయినట్లు ఆయన చెప్పారు.