: మహిళలు పోలీస్ శాఖలో భారీగా చేరాలంటున్న 'మర్దానీ' తార
భారత్ లో నేరాలు పెరిగిపోవడం పట్ల బాలీవుడ్ నటి రాణీ ముఖర్జీ ఆందోళన వ్యక్తం చేశారు. మహిళల అక్రమ రవాణా, ఇతర నేరాలను అరికట్టేందుకు మహిళలు ఎక్కువ సంఖ్యలో పోలీస్ శాఖలోకి రావాలని సూచించారు. స్త్రీల బాధలు స్త్రీలకే ఎక్కువగా తెలుసని, అందుకే, అక్రమరవాణా వంటి నేరాలను అరికట్టేందుకు వారే నడుం బిగించాలని పిలుపునిచ్చారు. ఆగస్టులో విడుదలైన లేడీ ఓరియెంటెడ్ చిత్రం 'మర్దానీ'లో రాణీ ముఖర్జీ పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటించారు.